Search This Blog

Thursday 22 January 2015

E velalo neevu yem chesthu vuntavo

పాట: ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
చిత్రం: గులాబి(1995)
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: శశి ప్రీతమ్
గానం: సునీత
ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో 
అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషము నేను
నా గుండె ఏనాడో చేజారిపోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన ఉంటూనే ఏం మాయ చేసావో
ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషము నేను

నడిరేయిలో నీవు నిదరైనా రానీవు
గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము
పగలైన కాసేపు పనిచేసుకోనీవు
నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము
ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది
నువు కాక వేరేది కనిపించనంటోంది
ఈ ఇంద్రజాలాన్ని నీవేన చేసింది
నీ పేరులో ఏదో తియనైన కైపుంది
నీ మాట వింటూనే ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదో నను నిలవనీకుంది
మతిపోయి నేనుంటే నువు నవ్వుకుంటావు
ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషమూ నేను (2)

ఈ వేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో.. అనుకుంటు ఉంటాను.. ప్రతి నిమిషము నేను..
నిజమే ఒకమనిషిని మరొక మనిషి ఇష్టపడితే అమె ఆలోచనలే ఎప్పుడూ గుండెను తడుతూ వుంటే ఇలాంటి భావాలుకదులుతూ ఉంటాయి.. ఎక్కడుందో ఏంచేస్తుందో నంటూ..తను గుర్తొచ్చిన ప్రతిసారి గుండె వేగం పెరుగుతుంది..ఏంటో అప్పటికప్పుడు తన పంచుకున్న అందమైన అనుభూతుల జ్ఞాపకాలు మనసు తడుతూ హాయినిస్తాయీ...ఏంటో ఒక్కొక్కరి పరిచయం అంతటి తియటి జ్ఞాపకాలను మిగులుస్తాయి..మనసును కదిలిస్తుంటాయి 
"నడిరేయిలో నీవు నిదరైన రానీవు
గడిపేదెలా కాలము..గడిపేదెలా కాలం"

కాలం కదులుతున్నా ఒక్కోసారి అలా గడియ ఆగిపోతుదా అనిపిస్తుంది తన ఊసులతో ఉహల పల్లకిలో ఊరేగుతున్న సమయంలో రాత్రుల్లు నిద్రకూడారాదు తనే గుర్తుకొస్తుంది ఏంచేస్తుందా అని ఎందుకంటే ఒక్కోసారి ఇద్దరు రాత్రులు పంచుకున్న ఊసులు గుతుకొస్తే నిద్ర ఎల పడుతుంది 
"పగలైనా కాసేపు పని చేసుకోనీవు..నీ మీదనే ధ్యానము..నీ మీదనే ధ్యానము"
రాతుల్లు అలా నిద్రలేని రాత్రుల్లేకాదు పగలు కాసేపు పడుకుందామని చూసినా .. తన జ్ఞాపకాలు మనసులో గుచ్చుతుంటే నిద్ర ఎలా వస్తుంది..ఏంటో ఏటుచూసినా తన రూపం కనిపిస్తుంది...ఎవరితో మాట్లాడీనా తనమాటలే గుర్తుకు వస్తాయి..
"నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది .నీ మాట వింటునే.. ఏం తోచనీకుంది నీ మీద ఆశేదో..నను నిలవనీకుంది.." 

No comments:

Post a Comment