Search This Blog

Monday 26 January 2015

Janani Janma Boomicha


పాట:: జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీగరియసీ

చిత్రం: బొబ్బిలి పులి (1982)
గానం : ఎస్.పి.బాలు
సంగీతం : జె.వి . రాగావులు
రచన : దాసరి నారాయణరావు


జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరియసీ.. స్వర్గాదపీ గరియసీ
ఏ తల్లి నిను కన్నదో.. ఏ తల్లి నిను కన్నదో
ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరియసీ స్వర్గాదపీ గరియసీ

నీ తల్లి మోసేది నవమాసాలేరా
ఈ తల్లి మోయాలి కడవరకురా
కట్టె కాలెవరకు.రా.
ఆ రుణం తల కొరివితో తీరేనురా
ఈ రుణం ఏ రూపాన తీరేదిరా
ఆ రూపమే ఈ జవానురా త్యాగానికి మరో రూపు నువు రా
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరియసీ స్వర్గాదపీ గరియసీ

గుండె గుండెకు తెలుసు గుండె భరువెంతో
ఆ గుండెకే తెలుసు గుండె కోత భాదెంతొ
నీ గుండె రాయి కావాలి ఆ గుండెల్లొ ఫిరంగులు మోగాలి
మనిషిగా పుట్టిన ఓ మనిషి
మారాలి నువు రాక్షసుడిగా
మనుషుల కోసం.. ఈ మనుషుల కోసం.. నీ మనుషుల కోసం
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీగరియసీ స్వర్గాదపీగరియసీ

No comments:

Post a Comment