Search This Blog

Monday 26 January 2015

VANDEMATARAM





గీతం : వందేమాతరం
రచన : బంకించంద్ర ఛటర్జీ
వందేమాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్య శ్యామలాం మాతరమ్ ||వందే||

శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం
పుల్లకుసుమిత ద్రుమదల శోభినీం
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరమ్ || వందే ||

కోటికోటి కంఠ కలకల నినాదకరాలే
కోటి కోటి భుజైర్ ధృత కర కరవాలే
అబలా కేయనో మా ఏతో బలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదలవారిణీం మాతరామ్ || వందే ||

తిమి విద్యా తిమి ధర్మ తుమి హృది తుమి మర్మ
త్వం హి ప్రాణాః శరీరే
బాహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి
తో మారయి ప్రతిమా గడి మందిరే మందిరే || వందే ||

త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణీ
కమలా కమలదళ విహారిణీ
వాణీ విద్యాదాయినీ
నమామి త్వాం
నమామి కమలామ్ అమలామ్ అతులాం
సుజలాం సుఫలాం మాతరమ్ || వందే ||

శ్యామలాం సరలాం సుస్మితాం భూషితాం
ధరణీం భరణీం మాతరం

వందేమాతరం తాత్పర్యము
తల్లికి నమస్కరించుచున్నాను. మంచినీరు, మంచి పంటలు, మలయమారుతముల చల్లదనము గలిగి సస్యశ్యామలమైన (మా) తల్లికి నమస్కరించుచున్నాను.

తెల్లని వెన్నెలలతో పులకించిన రాత్రులు గలిగి, వికసించిన పూలు, చివురులుగల తరువులతో ప్రకాశించుచు దరహాసములతోనూ, మధుర భాషణములతోను, సుఖమును, వరములను ఇచ్చు (మా) తల్లికి నమస్కరించుచున్నాను.

కోటి కోటి కంఠముల కల కల నినాదములతో కరకు తేలిన తల్లి! కరకు కత్తులు ధరించిన అనేక కోట్ల భుజముల బలముగల మాతా! అబలలకు బలమైనదేవీ? వివిధ శక్తులు ధరించి శత్రువుల నివారించుచు (మమ్ము) తరింపజేయగల మా తల్లీ! నమస్కరించుచున్నాను.

నీవే విద్య, నీవే ధర్మము, నీవే హృదయము, నీవే మర్మము. శరీరములో ప్రాణము నీవే! తల్లి! మా శక్తివి, మా మనస్సులలోని భక్తివి నీవే! మా హృదయ మందిరములలో వెలసిన ప్రతిమవు నీవే! నీకు నమస్కరించుచున్నాను.

పది ఆయుధములు చేతబట్టిన దుర్గవు నీవే. పద్మదళములందు విహరించెడి లక్ష్మివి నీవే. విద్యా ధాత్రియైన శారదవు నీవే. కమలా! అమలా! అతులా! సుజలా! సుఫలా! శ్యామలా! సరళా! సుస్మితా! అలంకృతా! (మమ్ము) భరించుమాతా! భూమాతా! నీకు నమస్కరించుచున్నాను

No comments:

Post a Comment