Search This Blog

Monday 26 January 2015

Padavoyi Bharateeyudaa

Movie: Velugu Needalu
పాడవోయి భారతీయుడా
ఆడి పాడవోయి విజయగీతిక
పాడవోయి భారతీయుడా
ఆడి పాడవోయి విజయగీతిక
పాడవోయి భారతీయుడా
నేడే స్వాతంత్ర్య దినం వీరుల త్యాగఫలం
నేడే స్వాతంత్ర్య దినం వీరుల త్యాగఫలం
నేడే నవోదయం నీదే ఆనందం ఓ..ఓ..
పాడవోయి భారతీయుడా
ఆడి పాడవోయి విజయగీతిక
పాడవోయి భారతీయుడా
ఓ..ఓ..ఓ..ఓ...
స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి
సంబరపడగానే సరిపోదోయి
స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి
సంబరపడగానే సరిపోదోయి
సాధించిన దానికి సంతృప్తిని పొంది
అదే విజయమనుకుంటే పొరపాటోయి
ఆగకోయి భారతీయుడా
కదలి సాగవోయి ప్రగతిదారుల
ఆగకోయి భారతీయుడా
కదలి సాగవోయి ప్రగతిదారుల
ఆగకోయి భారతీయుడా
ఆకాశం అందుకునే ధరలొకవైపు
అదుపులేని నిరుద్యోగం ఇంకొకవైపు
ఆకాశం అందుకునే ధరలొకవైపు
అదుపులేని నిరుద్యోగం ఇంకొకవైపు
అవినీతి బంధుప్రీతి చీకటి బజారు
అలుముకున్న నీ దేశం ఎటు దిగజారు
కాంచవోయి నేటి దుస్థితి
ఎదిరించవోయి ఈ పరిస్థితి
కాంచవోయి నేటి దుస్థితి
ఎదిరించవోయి ఈ పరిస్థితి
కాంచవోయి నేటి దుస్థితి
పదవీ వ్యామోహాలు కులమత భేదాలు
భాషా ద్వేషాలు చెలరేగె నేడు
పదవీ వ్యామోహాలు కులమత భేదాలు
భాషా ద్వేషాలు చెలరేగె నేడు
ప్రతి మనిషీ మరియొకని దోచుకునేవాడే
ప్రతి మనిషీ మరియొకని దోచుకునేవాడే
తన సౌఖ్యం తన భాగ్యం చూసుకునేవాడే
స్వార్థమే అనర్థ కారణం
అది చంపుకొనుటే క్షేమదాయకం
స్వార్థమే అనర్థ కారణం
అది చంపుకొనుటే క్షేమదాయకం
స్వార్థమే అనర్థ కారణం
సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం
సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం
సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం
సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం
సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం
సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం
ఏకదీక్షతో గమ్యం చేరిననాడే
లోకానికి మన భారతదేశం
అందించునులే శుభసందేశం
లోకానికి మన భారతదేశం
అందించునులే శుభసందేశం
లోకానికి మన భారతదేశం
అందించునులే శుభసందేశం

No comments:

Post a Comment